![]() |
![]() |

ఆలియా హజ్బెండ్ రణ్‌బీర్ కపూర్ అంటే మన సౌత్ వాళ్లకి చాలా బాగా అర్థమవుతుంది. ఆయన నటించిన లేటెస్ట్ సినిమా తూ జూటీ మే మక్కర్. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయి విడుదలకు సిద్ధమైంది. ఈ సినిమాను 180 రోజులు తెరకెక్కించారట. అందులోనూ అసలు స్క్రిప్ట్ లేదట. ఈ సినిమా గురించి ఇంట్రస్టింగ్ విషయాలను రివీల్ చేశారు నాయిక శ్రద్ధాకపూర్. ``దాదాపు మూడేళ్ల తర్వాత నేను బిగ్ స్క్రీన్‌కి వస్తున్నాను. చాలా టెన్షన్‌గా ఉంది. 180 రోజులు షూట్ చేశాం. చాలా కష్టపడ్డాం. అందులోనూ స్క్రిప్ట్ లేకుండా చేసిన మూవీ ఇది`` అని అన్నారు. రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ ``ఈ సినిమా ఎప్పుడో విడుదల కావాల్సింది. కానీ బ్రహ్మాస్త్ర నా సమయం మొత్తం లాగేసుకుంది. మా నాన్న రిషికపూర్ అనారోగ్యంతో చనిపోయారు. ఆ టైమ్‌లో నేను ఆయనతో ఉండాల్సి వచ్చింది. సినిమా విడుదల ఆలస్యమైనా నాకేం టెన్షన్‌గా లేదు. నమ్మి చేసిన సినిమా ఎప్పటికైనా క్లిక్ అవుతుంది. రొమాంటిక్ కామెడీ సినిమా ఇది. ఇలాంటి వాటిని 120 రోజుల్లో తీసేస్తారు. కానీ మేం కాస్త ఎక్కువ శ్రద్ధ పెట్టి 180 రోజులు చేశాం`` అని అన్నారు.
చిత్ర దర్శకుడు లవ్ రంజన్ మాట్లాడుతూ ``నేను ట్రైలర్‌లో కూడా కథఅసలు చెప్పలేదు. ఈ చిత్రంలో రణ్‌బీర్ కపూర్, శ్రద్ధా కపూర్ ఇద్దరూ గ్రే షేడ్స్ లో కనిపిస్తారు. ఈ సినిమాకు జూటీ మక్కర్ అని పేరు పెడదామనుకున్నా. కానీ ఇంప్రవైజ్ చేసి ఈ పేరు పెట్టాను`` అని అన్నారు. అంతా బాగానే ఉంది కానీ, అసలు కథను స్క్రిప్ట్ పేపర్ మీద చూడకుండా రణ్‌బీర్ ఎలా ఒప్పుకున్నారు? డైలాగులను ఎలా ప్రాక్టీస్ చేశారు? అసలే బాలీవుడ్‌లో సక్సెస్ రేట్ తక్కువగా ఉంది. ఇలాంటి సమయంలో ఇలాంటి ప్రయోగాలు అవసరమా అని అంటున్నారు నెటిజన్లు. అలాంటి ఫికరే వద్దు, మా సినిమా తప్పక హిట్ అవుతుందని చెబుతున్నారు రణ్‌బీర్.ఈ చిత్రంతో పాటు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో యానిమల్‌లోనూ నటిస్తున్నారు రణ్‌బీర్. ఇందులో రష్మిక మందన్న నాయికగా నటిస్తున్నారు. ఈ చిత్రం పూర్తయిన వెంటనే బ్రహ్మాస్త్ర సెట్స్ కి వెళ్తారు రణ్‌బీర్.
![]() |
![]() |